- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ ఘటన.. మందు ఇవ్వలేదని వైన్ షాపుకే నిప్పుపెట్టిన యువకుడు
మద్యం ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు ఏకంగా వైన్ షాపుకే నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణ ఘటన వెలుగుచూసింది. అడిగిన సమయంలో మద్యం ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు ఏకంగా వైన్ షాపుకే నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి రాంచీలోని పాండ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమయం దాటిపోయిందని, మద్యం స్టాక్ లేదని షాప్ సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టు మద్యం షాప్ సిబ్బంది భావిస్తున్నారు.
సీసీటీవీ వీడియోలో ఏముంది..?
స్కూటీపై హెల్మెట్ ధరించి వచ్చిన నిందితుడు, డిక్కీలో నుంచి పెట్రోల్ బాటిల్ తీసి షాపు షట్టర్‌పై చల్లాడు. అనంతరం అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అతడు కూడా తృటిలో మంటల నుంచి తప్పించుకుని అక్కడి నుంచి స్కూటీపై పరారయ్యాడు. మంటలను గమనించిన షాపు సిబ్బంది వెంటనే అప్రమత్తమై వాటిని అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
పాత కక్షలు ఏమైనా ఉన్నాయా?
సమాచారం అందుకున్న పాండ్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కేవలం మద్యం ఇవ్వలేదన్న కోపంతోనే ఈ దాడి చేశాడా? లేక వ్యక్తిగత గొడవలు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు షాపు యజమానిని విచారిస్తున్నారు. కాగా, రాజధానిలోని (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై జరిగిన పెట్రోల్ బాంబు దాడిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన కొద్దిసేపటికే, రాంచీ లో మరో పెట్రోల్ దాడి ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. ఈ ఘటనలో ఇద్దరు యువకులు పాల్గొన్నారు. పలు ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి.






