పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. 22 గంటలు కాలి నడకన వచ్చి!

by Ajay Maddhiboyina |

పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. 22 గంటలు కాలి నడకన వచ్చి!
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు దాడికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాయి. ఇందులో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్టు గుర్తించాయి. ఫోరెన్సిక్ నివేధికల ఆధారంగా దాడి కోసం కే 47, ఎం4 తుపాకులు వాడినట్టు నిర్ధారించాయి. ఉగ్రవాదులు అత్యంత క్లిష్టమైన హిమాలయ పర్వతాలు, పహల్గామ్ అడవుల్లో నుండి 22 గంటల పాటూ కాలినడకన వచ్చినట్టు గుర్తించాయి. కొకెర్నాగ్ అడవుల నుండి బైసరన్ లోయకు వచ్చేందుకు కష్టతరమైన భూభాగం గుండా నడిచి వచ్చి దాడి చేశారని పేర్కొన్నాయి.

ముందుగా ఉగ్రవాదులు దుకాణాల వెనక నుండి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పెట్టి కాల్పులు జరిపినట్టు గుర్తించారు. దాడికి ముందు వారిని కల్మా పటించాలని అడిగినట్టు తెలుస్తోంది. కాల్పుల సమయంలో పర్యాటకులు పరుగులు తీయడంతో జిప్ లైన్ వద్ద ఉన్న ఇద్దరు టెర్రరిస్టులు వారిపై కాల్పులు జరిపినట్టు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఓ ఫోటోగ్రాపర్ చెట్టుపైకి ఎక్కి ఘటనను పూర్తిగా వీడియో తీశాడు. ఉగ్రవాదుల కంటపడకుండా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన ఇచ్చిన వీడియో ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. సీన్ రీ కన్స్‌ట్రక్షన్ చేసేందుకు దాడి సమయంలో ఉన్న పర్యాటకుల నుండి వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ఇక ఉగ్రవాదులు పట్టుబడితే వారిని అత్యంత కఠినంగా శిక్షిస్తామని కేంద్రం ఇప్పుడే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Next Story