- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్ ఓటర్ల జాబితా సవరణలో షాకింగ్ వివరాలు.. 64 లక్షల మంది ఓట్ల తొలగింపు!
బిహార్‌లో (Bihar) తొలి విడత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (Special Intensive Revision - SIR) ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్: బిహార్‌లో (Bihar) తొలి విడత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (Special Intensive Revision - SIR) ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (EC) షాకింగ్ వివరాలు వెల్లడించింది. మొత్తం 7.89 కోట్ల ఓటర్లలో సుమారు 99.8 శాతం ఓటర్ల గణన ప్రక్రియ పూర్తయిందని చెప్పింది. ఇందులో భాగంగా సుమారు 64 లక్షల మంది ఓటర్లు తప్పుడు, పాత సమాచారం ఆధారంగా ఓటర్ లిస్ట్‌లో ఉన్నారని గుర్తించినట్లు తెలిపింది. వీరిలో 22 లక్షల మంది మృతిచెందినవారిగా, 35 లక్షల మంది వలస వెళ్ళిపోయినవారిగా లేదా చిరునామా తెలియని వారిగా, 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగినవారిగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే, 1.2 లక్షల మంది ఓటర్ల గణన పత్రాలు తిరిగి అందలేదని ఈసీ తెలిపింది. ఇక సవరించిన ఓటర్ల జాబితా ఆగస్టు 1న విడుదలవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాలు, సూచనలు తీసుకోవడానికి అవకాశముంటుంది. చివరిగా సెప్టెంబర్ 30న తుది ఓటర్ల జాబితా (final roll) ప్రకటించబడుతుంది. డేటా సేకరణ, జాబితా పరిశీలన పూర్తిగా డిజిటల్ మాద్యంలో జరిగింది. తొలగించబడిన ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలతో పంచుకుంటామని ఈసీ తెలిపింది.






