Shocking: దారుణం.. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ

by Ramesh Goud |

ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగి, సమాజం ముందుకు పోతున్నా.. కొందరు కుల వ్యవస్థను విడనాడటం లేదు.

Shocking: దారుణం.. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగి, సమాజం ముందుకు పోతున్నా.. కొందరు కుల వ్యవస్థను విడనాడటం లేదు. కులాల మధ్య అంతరాలు విధిస్తూ.. పురాతన పోకడలను అనుసరిస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్(Madhyapradesh) ఛతర్‌పూర్ జిల్లా(Chatharpur District)లో జరిగింది. దళితుడి పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కణ విధించారు. అత్రార్ గ్రామం(Athrar Village)లో తలైయా హనుమాన్ ఆలయంలో(Thalia Hanuman Temple) ఓ దళిత వర్గానికి చెందిన వ్యక్తి తన కోరిక నెరవేరిందని మొక్కు తీర్చుకున్నాడు.

ఆలయానికి వచ్చిన భక్తులకు మగజ్ లడ్డూను ప్రసాదంగా అందజేశాడు. ఈ ప్రసాదాన్ని గ్రామంలోని బ్రాహ్మణులు సహా ఇతర వర్గాలకు చెందిన 20 కుటుంబాలకు చెందిన వాళ్లు స్వీకరించారు. ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ ఆగ్రహానికి గురయ్యాడు. లడ్డూ ప్రసాదం తిన్న 20 కుటుంబాలపై సామాజిక బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించాడు. వీరు గ్రామంలో జరిగిన వివాహాలు సహా ఏ కార్యక్రమాలకు హాజరు కావద్దని హుకూం జారీ చేశాడు. దీంతో బాధితులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించి, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ ఆగం జైన్ స్పందిస్తూ.. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, సీనియర్ అధికారులను రంగంలోకి దించి విచారణ జరిపిస్తామని చెప్పారు.

Next Story