బర్త్‌ డే వేళ సోనియాగాంధీకి షాక్.. నోటీసులు ఇచ్చిన రౌస్‌ అవెన్యూ సెషన్స్‌ కోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-09 07:41:46  IST  )

జన్మదిక వేడుకల వేళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షాకిచ్చింది.

బర్త్‌ డే వేళ సోనియాగాంధీకి షాక్.. నోటీసులు ఇచ్చిన రౌస్‌ అవెన్యూ సెషన్స్‌ కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: జన్మదిన వేడకుల వేళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. 1980–81లో న్యూ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో సోనియా‌గాంధీ పేరు చేర్చిన వ్యవహారంపై దాఖలైన ఫిర్యాదును మ్యాజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివిజన్ పిటిషన్‌పై ఈ నోటీసులు వెలువడ్డాయి.

సోనియా‌గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందినప్పటికీ, అంతకు ముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చారని, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్, భారతీయ శిక్షా స్మృతి (IPC/BNS) నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిచారని ఢిల్లీ న్యాయవాది వికాస్ త్రిపాఠి ఆరోపించారు. సెప్టెంబర్ 2025లో మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టి సరైన ఆధారాలు లేవని, చట్టపరంగా కనిపెట్టడం అసాధ్యమని కేసును తోసిపుచ్చింది. అయితే, కోర్టు వ్యాఖ్యలను సవాలు చేస్తూ వికాస్ త్రిపాఠి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను ఇవాళ రౌస్ అవెన్స్ కోర్టు సెషన్స్ జడ్జి విశాల్ గోగ్నే విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల నుంచి స్పందన కోరుతూ.. మ్యాజిస్ట్రేట్ కోర్టు రికార్డులు (TCR) సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా పౌరసత్వం రాకముందే ఓటరు జాబితాలో పేరు ఉండటంపై వివరణ ఇవ్వాలని ప్రతివాదిగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కూడా నోటీసులు జారీ చేశారు. కేసులో తదుపరి విచారణను 2026, జనవరి 6కు వాయిదా వేశారు.

Next Story