- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చమురు కంపెనీలకు ఝలక్.. ఇంధన ఎగుమతులపై కేంద్రం పన్ను విధింపు
చమురు కంపెనీలకు కేంద్రం ఊహించని షాకిచ్చింది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశీయంగా కొరత రాకుండా ఎగుమతులపై పన్ను విధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ను విదేశాలకు ఎగుమతి చేసే ఆయిల్ రిఫైనరీలపై ప్రభుత్వం ఎగుమతి పన్ను (Export Tax) విధించినట్లుగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఇవాళ ప్రకటించారు. అందులో డీజిల్‌పై లీటర్‌కు రూ.21.5, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై లీటర్‌కు రూ.29.5కు ట్యాక్స్ పెరిగింది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, భారతీయ రిఫైనరీ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేయడం కంటే దేశీయ మార్కెట్‌కే సరఫరా చేసేలా ప్రభుత్వం ఈ పన్నును విధించింది.
సామాన్యులపై భారం పడొద్దనే ఈ నిర్ణయం.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్
Next Story






