- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారోత్సవాల వేళ మావోయిస్టులకు షాక్.. ఆ స్మారక చిహ్నాల కూల్చివేత
దేశంలో మావోయిస్టుల (Maoists) ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) ఉధృతంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మావోయిస్టుల (Maoists) ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 200 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తరచూ ఎదురుకాల్పులు నేటీకి జరుగుతూనే ఉన్నాయి. అయితే, ప్రతి ఏడాది మాదిరిగానే జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా మావోయిస్టు పార్టీ ఇటీవలే ఓ లేఖను విడుదల చేసింది. నేటి నుంచి వారోత్సవాలు ప్రారంభవుతోన్న వేళ దంతెవాడ జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కహ్చెనార్ గ్రామ సమీపంలో నిర్మించిన మొత్తం 3 స్మారక చిహ్నాలను సీఆర్‌పీఎఫ్-195 బలగాలు గుర్తించి ధ్వంసం చేశాయి. వారోత్సవాల సందర్భంలో మావోయిస్టులు స్మారక చిహ్నాలకు నివాళులర్పించకూడదనే వాటిని భద్రత బలగాలు కూల్చివేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.






