- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్!
రాఖీ పండగ అంటే అన్నాదమ్ములకు అక్కాచెల్లెల్లు రాఖీ కట్టి పండగను జరుపుకుంటారు. కానీ కేంద్రమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఓ చెట్టుకు రాఖీ కట్టి

దిశ, వెబ్ డెస్క్: రాఖీ పండగ అంటే అన్నాదమ్ములకు అక్కాచెల్లెల్లు రాఖీ కట్టి పండగను జరుపుకుంటారు. కానీ కేంద్రమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఓ చెట్టుకు రాఖీ కట్టి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే చెట్టుకు రాఖీ కట్టడం వెనక అసలు కారణం ఏంటో కూడా ఆయన వివరణ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి రాఖీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే చెట్టుకు రాఖీ కట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాఖీ పండగ అంటే సోదరీమణులు సోదరులకు రాఖీ కడతారని చెప్పారు. ఆ సమయంలో అన్నాదమ్ములు తమ సోదరికి తోడుగా, రక్షణగా ఉంటామని మాట ఇస్తారని తెలిపారు. కానీ ఇప్పుడు అక్కాచెల్లెల్లు కూడా చాలా స్ట్రాంగ్ అయ్యారని, వాళ్లు తమ సోదరులకు రక్షణగా ఉంటున్నారని అన్నారు. కాబట్టి రాఖీ పండగ అన్నా చెల్లెల్లను, అక్కా తమ్ముళ్లను రక్షించడంతో పాటు దేశాన్ని రక్షించే పండగలా మారాలన్నారు. ప్రపంచాన్ని రక్షించే పండగలా, ప్రపంచంలోని పర్యావరణాన్ని రక్షించే పండగలా మారాలన్నారు. ఈ రక్షాబందన్ రోజున ప్రతిఒక్కరూ దేశాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేయాలని, స్వదేశీ వస్తులే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.






