- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India: ఎయిరిండియాపై కేంద్రమంత్రి పైర్.. ఎందుకంటే?
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిరిండియా (Air India)పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఫైర్ అయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిరిండియా (Air India)పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఫైర్ అయ్యారు. ఇటీవలే భోపాల్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియాలో ఆయన చేసిన ప్రయాణం గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు విరిగిపోయిన సీటుని కేటాయించారని మండిపడ్డారు. ఇదంతా ప్రయాణికులను మోసం చేయడమే అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. చౌహాన్ తన ప్రయాణం గురించి చెప్తూ.. ‘‘విమానం ఎక్కిన వెంటనే నేను బుక్ చేసుకున్న సీటు విరిగిపోయి ఉండటంతో షాక్ అయ్యాను. దనిపై ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ప్రశ్నించగా.. ఈ సమస్యను యాజమాన్యం ఆలస్యంగా గుర్తించిందని..ఈ సీటు టికెట్‌ను ప్రయాణికులకు విక్రయించకూడదని ఆదేశించిందని తెలిపారు. విమానంలో అదొక్కటే కాకుండా మరిన్ని సీట్లు కూడా సరిగా లేవని సిబ్బంది చెప్పారు’’ అని అన్నారు. తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోమని ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. కానీ వారికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక తాను అదే విరిగిపోయిన సీట్‌లోనే గంటన్నర పాటు కూర్చొని ప్రయాణించానని తెలిపారు. అయితే, ఎయిరిండియాను టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత ఎయిర్ లైన్స్ సేవలు మెరుగుపడతాయని అనుకున్నట్లు తెలిపారు. కానీ, అదంతా అపోహే అని తేలిందన్నారు.
కేంద్రమంత్రికి ఎయిరిండియా క్షమాపణలు
ప్రయాణికుల నుంచి టికెట్ కోసం పూర్తి డబ్బులు వసూలు చేసి.. అసౌకర్యమైన సీట్లు కేటాయించడం ప్రయాణికులను మోసం చేసినట్లు కాదా? అని చౌహాన్ మండిపడ్డారు. కేంద్రమంత్రి ట్వీట్‌పై ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 2022లో ప్రభుత్వం విమానయాన సంస్థ ఎయిరిండియాను రూ.18 వేల కోట్లకు టాటా గ్రూప్‌నకు అధికారికంగా అప్పగించింది. అయితే, టాటా గ్రూప్ ఎయిరిండియా పరిధిని విస్తరించడంలో విజయం సాధించినప్పటికీ.. ముఖ్యంగా సుదూర మార్గాల్లో విమానాల ఆలస్యం, కొన్ని విమానాల్లో పాడయిపోయిన సీట్లు ఇప్పటికీ ఉన్నాయి.






