- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shine tom: డ్రగ్స్ కేసులో ప్రముఖ మలయాళ నటుడు అరెస్ట్
డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ( Shine Tom Chacko) ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టంలోని సెక్షన్ 27, సెక్షన్ 29 కింద కేసు నమోదు చేశారు. కొచ్చిలోని కలూర్‌లో ఉన్న ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే ఆరోపణలతో యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల హోటల్ పై దాడి చేశారు. ఆ టైంలో షైన్ టామ్ అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వచ్చారని గ్రహించిన చాకో తన గది మూడో అంతస్తు కిటికీ నుంచి టెర్రస్ పై దూకి పారిపోయినట్టు కథనాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన సీసీ పుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు షైన్ టామ్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించడంతో శనివారం ఆయన పోలీసులు ఎదుట హజరయ్యారు. ఈ క్రమంలోనే నాలుగు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు చాకోను అరెస్ట్ చేశారు. చాకో మొబైల్ కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ చాట్‌లను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. అరెస్టైన వెంటనే ఆయనకు బెయిల్ సైతం లభించినట్టు సమాచారం.






