- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెను విషాదం.. ఫుట్‌బాల్ ఆడుతూ ఎంపీ మృతి!
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ప్రమాదం జరిగింది. ఫుట్ బాల్ ఆడుతూ స్థానిక ఎంపీ రికీ సింగ్కాన్ మరణించారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజుకో ప్రమాదం జరుగుతూనే ఉంది. ఏ మూలన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఊహించని సంఘటనలు, పెను విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ( Shillong) పెను ప్రమాదం జరిగింది. ఫుట్ బాల్ ఆడుతూ స్థానిక ఎంపీ రికీ సింగ్కాన్ ( Shillong MP Ricky Syngkon) మరణించారు. మావులాయి మావి యంగ్ అనే ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి గురువారం ఫుట్ బాల్ ( Football Match) ఆడేందుకు ఎంపీ రికీ వెళ్లారు. రోజువారి దిన చర్యలు భాగంగానే ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే గురువారం మాత్రం మ్యాచ్ ఆడుతుండగా ఒకసారిగా కుప్పకూలారట.
అడ్మిట్ అయిన 5 నిమిషాలకే ఎంపీ రికీ సింగ్కాన్ మృతి
ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన స్నేహితులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. స్థానిక సిహెచ్సి కి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ లేడని నిర్ధారించుకొని అక్కడి నుంచి మళ్లీ జైవాలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ అడ్మిట్ చేసిన ఐదు నిమిషాలకే మరణించారని తెలుస్తోంది. దీంతో షిల్లాంగ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు ఆయన కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. షిల్లాంగ్ పార్లమెంట్ సభ్యుడిగా రికీ సింగ్కాన్ మొన్న తొలిసారి ఎన్నికయ్యారు. ఇక రికీ సింగ్కాన్ మృతి నేపథ్యంలో మేఘాలయలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సంతాపం తెలుపుతున్నారు.






