- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Sheikh Hasina : షేక్ హసీనా పార్టీపై నిషేధం

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh) రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బంగ్లా మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) నాయకత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ(ALP Ban)పై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించింది. గత పది సంవత్సరాలుగా అధికారంలో కొనసాగిన ఈ పార్టీపై విపక్షాలు, మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ సంస్థల తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడటం, అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర అవినీతి, విపక్షాల అణచివేత, మీడియా స్వేచ్ఛపై అణచివేత చర్యలు, నిరసనకారుల అరెస్టులు వంటి ఆరోపణలు ఆవామీ పార్టీపై మోపబడ్డాయి.
అయితే దేశ భద్రత దృష్ట్యా యాంటీ టెర్రరిజం యాక్ట్ ప్రకారం మాత్రమే ALP పై బ్యాన్ విధిస్తున్నట్టు ప్రభత్వం పేర్కొంది. కాగా ఆవామీ పార్టీ నేతలపై ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ లో విచారణ పూర్తయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే 1949లో ఏర్పాటైన ఆవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించింది.