బంగ్లాదేశ్ కి తిరిగి వెళ్లడంపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

బంగ్లాదేశ్ రాజకీయ సంక్షభం అనంతరం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్ కి తిరిగి వెళ్లడంపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ రాజకీయ సంక్షభం అనంతరం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Former Prime Minister Sheikh Hasina) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కు చెందిన ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ తిరిగి వెళ్లడం పై క్లారిటీ ఇచ్చారు. "తాను తిరిగి స్వదేశానికి చేరుకునే విషయం, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ, ఆవామీ లీగ్‌పై నిషేధం ఎత్తివేత, అలాగే స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలు జరిగే పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. అలాగే క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ప్రభుత్వం, ప్రజలు తనకిచ్చిన ఆశ్రయం, ఆతిథ్యం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే హసీనా తనపై తీవ్ర వైఖరిని చూపుతున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ప్రభుత్వం భారత్ పట్ల ప్రదర్శిస్తున్న వైరం “మూర్ఖత్వం, స్వయంక్షతి దిశలో తీసుకెళ్తుంది” అని పేర్కొన్నారు. అలాగే ఆ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తూ.. అతి మతవాద శక్తులను బలపరుస్తోందని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. తాను మరణదండన ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ను “రాజకీయంగా తనను నిర్వీర్యం చేయడానికే రూపొందించిన కోర్ట్” అని హసీనా తీవ్రంగా ఖండించారు.

Next Story