- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
karantaka: భర్త, పిల్లలకు విషమిచ్చి చంపాలనుకుంది అంతలోనే..
కర్ణాటక (KARNATAKA) రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చైత్ర అనే మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త, అత్త, ఇద్దరు పిల్లలు అడ్డొస్తున్నారని తినే ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది

దిశ, నేషనల్ డెస్క్ : కర్ణాటక (KARNATAKA) రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చైత్ర అనే మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త, అత్త, ఇద్దరు పిల్లలు అడ్డొస్తున్నారని తినే ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది. పోలీసులు కథనం ప్రకారం.. గజేంద్ర అనే వ్యక్తితో 11 ఏళ్ల కింద చైత్రకు వివాహం జరిగింది. వీరికి పది, ఎనిమిదేళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. చైత్రకు పెళ్లి కాకముందే పునీత్ అనే వ్యక్తితో సంబంధం ఉండేది. పెద్దల జోక్యంతో ఆ సంబంధం ముగిసినా ప్రస్తుతం శివు అనే వేరే వ్యక్తితో చైత్ర వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం కొనసాగించాలనుకుని తన భర్త, ఇద్దరు పిల్లలు, అత్త తినే ఆహారం, తాగే కాఫీలో విషం కలిపింది. అది తిని, తాగిన వారికి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కాగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. డాక్టర్లు మొదట ఫుడ్ పాయిజన్ గా భావించినా అది విష ప్రయోగం అని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. దీంతో భర్త గజేంద్ర హసన్ జిల్లా పోలీసులకు కంప్లైట్ చేశాడు.
ఉద్దేశపూర్వకంగానే విషం కలిపి
హసన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మహమ్మద్ సుజిత (SUJITHA) వివరాల ప్రకారం.. జూన్ 2న గజేంద్ర అనే వ్యక్తి తన భార్య చైత్ర, శివు అనే వ్యక్తి తమపై హత్యాయత్నం చేశారని బేలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక దర్యాప్తులో చైత్ర ఆహారంలో వివిధ మందులు రసాయనాలు కలిపినట్లు వెల్లడైంది. కేసులో శివు కూడా సహనిందితుడిగా చేర్చామని.. చైత్రను విచారిస్తున్నామని శివు కోసం గాలింపు కొనసాగుతోందని సుజిత తెలిపారు.ఈ వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి తన కుటుంబం అడ్డంకిగా మారుతుందన్న ఆందోళనతో చైత్ర భర్త, పిల్లలు, అత్తమామల్ని చంపేందుకు కుట్ర పన్నిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో చైత్ర (CHIATRA) ఉద్దేశపూర్వకంగా ఆహారంలో విషపదార్థాలు కలిపినట్టు తేలింది. వెంటనే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న శివు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.






