ముఖం ఛిద్రం, విరిగిన కాలు: మోజ్తబా ఖమేనీ ప్రస్తుత పరిస్థితి ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-24 03:27:17  IST  )

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తీవ్ర గాయాల పాలైనట్లుగా అంతర్జాతీయ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి.

ముఖం ఛిద్రం, విరిగిన కాలు: మోజ్తబా ఖమేనీ ప్రస్తుత పరిస్థితి ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: సీజ్ ఫైర్‌తో ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య గంభీర వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ‘ది న్యూయార్క్ టైమ్స్’ (The New York Times) నివేదిక ప్రకారం, మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖంతో పాటు పెదవులు తీవ్రంగా కాలిపోయినట్లు సమాచారం. ఈ కారణంగా ఆయన మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారని, భవిష్యత్తులో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ అవసరమవుతుందని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయితే, ఇప్పటికే మోజ్తబా ఖమేనీ కాలికి ఇప్పటికే మూడుసార్లు శస్త్రచికిత్స జరిగిందని, ఆయన ప్రస్తుతం కృత్రిమ కాలు (Prosthetic leg) కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. చేతికి కూడా సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నట్లుగా సమాచారం. తాను బలహీనంగా ఉన్నట్లు ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించడం లేదని, రహస్య ప్రాంతం నుంచే పనులు నిర్వహిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ (Israel) దాడుల భయంతో ఉన్నతాధికారులు కూడా ఆయనను నేరుగా కలవడానికి కూడా జంకుతుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కలిసినా.. మోజ్తబా ఖమేనీ హ్యాండ్‌రిటన్ నోట్స్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా సమాచారం.

Next Story