యూఎస్‌పై ప్రతీకార సుంకాలు వేయండి: శశిథరూర్

by Phanindra |

యూఎస్‌పై ప్రతీకార సుంకాలు వేయాలని, ఆ దేశాన్ని వదిలేసి ఇతర దేశాలతో వాణిజ్యం పెంచుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సలహా ఇచ్చారు.

యూఎస్‌పై ప్రతీకార సుంకాలు వేయండి: శశిథరూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై యూఎస్ విధించిన సుంకాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత ప్రభుత్వం కూడా యూఎస్‌పై ప్రతీకార సుంకాలు వేయాలని ఆయన సూచించారు. భారత్ నుంచి యూఎస్‌కు వచ్చే ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఈ సుంకాలు చాలా విషయాల్లో అన్యాయం, అసంబద్ధం అని నా ఫీలింగ్. మనం రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు. మనం ఈ పని ఓపెన్ మార్కెట్లో రూల్స్‌కు కట్టుబడి చేస్తున్న కొనుగోళ్లే. ప్రైజ్ క్యాప్‌‌ను మేం గమనించుకుంటూ కొనుగోళ్లు చేస్తున్నాం. అలాంటప్పుడు యూఎస్ ఇలా చేయడం కరెక్ట్ కాదు.

రష్యా నుంచి కొనుగోళ్లు చేస్తున్న చైనా, యూరోపియన్ యూనియన్ మీద ట్రంప్ ఎలాంటి సుంకాలు వేయలేదు’ అని థరూర్ అన్నారు. అలాగే యూఎస్ కూడా రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం వంటి కెమికల్స్‌ను కొనుగోలు చేస్తోందని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే యూఎస్‌పై కూడా ప్రతీకార సుంకాలు విధించి, యూఎస్‌-యేతర వాణిజ్యంపై భారత్ ఫోకస్ పెట్టాలని సూచించారు.

Next Story