- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖర్గే కామెంట్స్ పై ఎక్స్‌లో శశి థరూర్ సంచలన పోస్ట్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పై మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పై మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు ఇంగ్లీష్ చదవడం రాదని, కానీ ఆయన లాంగ్వేజ్ చాలా బాగుంటుందని అన్నారు. ఆ కారణంగానే ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ సభ్యుడిని చేశామని అన్నారు. అయితే ఖర్గే ఈ కామెంట్లు చేసిన తరవాత శశిథరూర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎగరడానికి అనుమతి అడగకూడదని, రెక్కలు మీవి ఆకాశం ఏ ఒక్కరిదీ కాదని ఓ ఫోటోను శశిథరూర్ ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో శశిథరూర్ చేసిన ట్వీట్ ఖర్గేకు కౌంటర్‌గానే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక శశిథరూర్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఖర్గే మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి దేశమే ముందు.. మోడీ తరవాత, కానీ కొందరికి దేశమే ముందు అని అన్నారు. దీంతో ఇద్దరి వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.






