- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కామెంట్స్.. ఆపై వివరణ!
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కామెంట్స్ చేశారు. మంత్రులు జైలుకెళ్తే పదవులు తొలగించే బిల్లుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి పార్టీ విధానాలకు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో పీఎం నుంచి మంత్రుల వరకు ఎవరైనా 30 రోజుల పాటు జైలులో ఉంటే వారి అధికారాన్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుండగా.. థరూర్ మాత్రం వీటికి మద్దతుగా మాట్లాడారు.
‘జైల్లో 30 రోజులుంటే మంత్రిగా ఎలా కొనసాగుతారు? ఇది కామన్ సెన్స్ కదా. ఈ బిల్లులో ఎలాంటి తప్పు ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. అయితే ఇంకేమైనా కోణం ఉందేమో అని తెలియాలంటే బిల్లు మొత్ం చదవాలి’ అని థరూర్ అన్నారు. దీంతో ఆయన మరోసారి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని విమర్శలు వచ్చాయి.
వీటిపై వివరణ ఇచ్చిన తిరువనంతపురం ఎంపీ.. ‘బిల్లుపై విపక్షాలు ఒక స్టాండ్ తీసుకోవడానికి ముందే నేను మీడియాతో మాట్లాడాను. జైలుకెళ్లిన వాళ్లు పదవులకు రాజీనామా చేయాలనే ఆలోచన మంచిదేనని నేను చెప్పా. ప్రభుత్వం తెచ్చిన బిల్లును నేను సమర్థించలేదు, అందుకని వ్యతిరేకించలేదు. మొత్తం చదివిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరించింది’ అని వివరణ ఇచ్చారు.






