- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాడెన్‌ను మర్చిపోయారా?.. ఆసిమ్ మునీర్‌తో లంచ్ చేసిన ట్రంప్‌పై చురకలు
ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ లంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చురకలేసిన శశిథరూర్.. ఒసామా బిన్ లాడెన్‌ను మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికన్ మీడియా పెద్దగా స్పందించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి చేసి సుమారు 3 వేల మంది మరణాలకు కారకుడైన ఒసామా బిన్ లాడెన్‌ను గుర్తుచేశారు థరూర్.
‘పాక్ డెలిగేషన్‌ను కలిసిన కొందరు యూఎస్ సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్ మర్చిపోయారేమో.. యూఎస్ ప్రజలు మాత్రం ఒసామాను అంత ఈజీగా మర్చిపోరు. చివరి వరకు ఒసామాను దాచి పెట్టిన పాకిస్తాన్‌ను కూడా అంత సులభంగా అమెరికన్లు క్షమించరు కూడా’ అని థరూర్ తెలిపారు.
అదే సమయంలో మునీర్‌తో లంచ్ సమయంలో భారత్ మీదకు సీమాంతర ఉగ్రవాదాన్ని పురిగొల్పుతూ.. టెర్రరిస్టులకు ఆయుధాలు, డబ్బలు, శిక్షణ ఇస్తున్న పాక్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుంటుందన్నారు. ఇలా చేయడం అమెరికాకు కూడా మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.






