- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sharmishtha Panoli: రాజకీయ మలుపు తీసుకున్న శర్మిష్ఠ పనోలి అరెస్టు
న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ (22) అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. పలువురు రాజకీయ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు, తృణమూల్ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ (22) అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. పలువురు రాజకీయ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు, తృణమూల్ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మే 30న శర్మిష్ఠ పనోలీని కోల్ కతా పోలీసులు గురుగ్రామ్ లో అరెస్టు చేసి, 14 రోజుల న్యాయ విచారణకు ఆదేశించారు. పనోలీ "ఆపరేషన్ సింధూర్" అనే అంశంపై చేసిన ఓ వివాదాస్పద వీడియోలో, పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దాడులపై మౌనంగా ఉన్న బాలీవుడ్ నటులను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వీడియోలో ఆమె రాజకీయ, అభ్యంతరకర భాషను ఉపయోగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా, ఆమె ఆ వీడియోను తొలగించి, బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అయినప్పటికీ, ఆమెపై అనేక ఎఫ్‌ఐఆర్ లు నమోదు కావడంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
క్షమాపణ చెప్పినా.. వేధిస్తారా
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్, శర్మిష్ఠ పనోలీకి మద్దతుగా మాట్లాడారు. ‘శర్మిష్ఠ తగిన భాషను ఉపయోగించలేదని నేను అంగీకరిస్తున్నాను. కానీ యువత ఈ రకమైన పదాలను తరచుగా ఉపయోగిస్తుంది. ఆమె ఇప్పటికే క్షమాపణ చెప్పింది. ఆమెను మళ్లీ వేధించడం, బెదిరించడం అవసరం లేదు. వెంటనే విడుదల చేయాలి’ అని కంగనా వ్యాఖ్యానించారు. బెంగాల్ రాష్ట్రాన్ని ఉత్తర కొరియాగా మార్చే ప్రయత్నం చేయకండి. ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి. ఆమె తన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణ చెప్పింది. ఆమె సాధారణంగా అన్న విషయాలు, ఇవాళ యువత తరచుగా ఇంగ్లీష్, హిందీలో ఇలాంటి భాషను ఉపయోగిస్తారని అన్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివాదం రాజకీయ వేదికగా మారింది. శర్మిష్ఠ పనోలీపై చర్యలు తీసుకోవడాన్ని కొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శర్మిష్ఠ పనోలీ అరెస్టును ఖండించారు. కోట్లాది మంది ఆరాధించే సనాతన ధర్మాన్ని అపహస్యం చేసే వారిపై కోల్ కతా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని పవన్ కల్యాణ్ టీఎంసీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.






