హాదీ హంతకులు భారత్ కు రాలేదు : బంగ్లాదేశ్ ప్రచారాన్ని ఖండించిన బీఎస్ఎస్

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్ లో ఇటీవల హత్యకు గురైన విద్యార్థినేత షరీఫ్ ఉస్మాన్ హాదీ కేసులో..

హాదీ హంతకులు భారత్ కు రాలేదు : బంగ్లాదేశ్ ప్రచారాన్ని ఖండించిన బీఎస్ఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో ఇటీవల హత్యకు గురైన విద్యార్థినేత షరీఫ్ ఉస్మాన్ హాదీ కేసులో.. ప్రధాన నిందితులు భారత్ కు పారిపోయారంటూ ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను భారత సరిహద్దు భద్రతా దళం (BSF), మేఘాలయ పోలీసు విభాగం తీవ్రంగా ఖండించాయి. హాదీ హత్య నిందితులు భారత్ కు వెళ్లారని ఢాకా పోలీసులు చేసిన ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాయి. సరిహద్దు దాటి భారత్ లోకి ఎవరూ ప్రవేశించలేదని బీఎస్ఎఫ్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దును దాటి నిందితులు భారత్ లోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. సరిహద్దుల్లో బలగాలు అప్రమత్తంగా ఉంటాయని, బంగ్లాదేశ్.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు దేశం ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని బీఎస్ఎఫ్ మండిపడింది.

అలాగే రాష్ట్రంలోకి నిందితులు రాలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని మేఘాలయ పోలీసులు తెలిపారు. బంగ్లా పోలీసులు, మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పారు. నిందితులు ఫైసల్ కరీం మసూద్, ఆలంగీర్ షేక్ లు తమ రాష్ట్రంలోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు. భారత్ లో గందరగోళం సృష్టించేందుకు బంగ్లాదేశ్ మీడియా ఉద్దేశపూర్వకంగా కల్పిత కథనాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

Next Story