- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shareef: యూనస్, దిస్సనాయకేలతో పాక్ ప్రధాని రహస్య భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Mohammad Yunus)తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahabaz shareef) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై చర్చించినట్టు చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం తెలిపారు. ఇది యూనస్, షరీఫ్ మధ్య జరిగిన రెండో సమావేశం. అంతకుముందు ఇరువురు నేతలు గతేడాది సమావేశమయ్యారు. కాగా, పలు సమస్యల కారణంగా గత 15 ఏళ్లుగా అవామీలీగ్ పాలనలో బంగ్లాదేశ్, పాక్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు పాక్ ప్రధాని షరీఫ్ శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకేతోనూ సమావేశమై దైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పాక్, శ్రీలంకల ద్వైపాక్షిక సంబంధాల పై ఇద్దరు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి.






