Amit Shah: శరద్ పవార్ కుట్ర రాజకీయాలను బీజేపీ అంతం చేసింది: అమిత్ షా

by S Gopi |

శరద్ పవార్‌తో పాటు ఉద్ధవ్ ఠాక్రెలను ఎక్కడ ఉంచాలో ప్రజలు నిర్ణయించారన్నారు.

Amit Shah: శరద్ పవార్ కుట్ర రాజకీయాలను బీజేపీ అంతం చేసింది: అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ భారీ విజయంతో ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ రాజకీయాలకు తెర పడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం శిరిడీలో జరిగిన బీజేపీ సదస్సుల్లో పాల్గొన్న ఆయన.. శరద్ పవార్ ద్రోహ రాజకీయాలను తమ పార్టీ విజయంతో అంతం చేసినట్టు అమిత్ షా తెలిపారు. 1978లో శరద్ పవార్ మొదలుపెట్టిన అస్థిర, వెన్నుపోటు, కుట్ర రాజకీయాలకు మహారాష్ట్ర విజయం (బీజేపీ) ముగింపు పలికింది. వారి రాజకీయాలను ప్రజలు పాతరేశారన్నారు. శరద్ పవార్‌తో పాటు ఉద్ధవ్ ఠాక్రెలను ఎక్కడ ఉంచాలో ప్రజలు నిర్ణయించారన్నారు. బీజేపీ విజయం ద్వారా రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని, తద్వారా బీజేపీ సంకల్పం నెరవేరిందని వెల్లడించారు. ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా శరద్ పవార్, ఎన్నో సహకార సంస్థలను నిర్వహించినప్పటికీ రైతుల ఆత్మహత్యలను ఆపలేకపోయారని అమిత్ షా విమర్శలు చేశారు. రైతుల ఆత్మహత్యలను నిలువరించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకుంటోందని, రైతుల సంక్షేమం కోసం ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అమిత్ షా పేర్కొన్నారు. కాగా, 1978లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన శరద్ పవార్ 40 మంది ఎమ్మెల్యేలతో వసంతదాదా పాటిల్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ 2023లో పార్టీని చీల్చి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరారు. అందులో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 132 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Next Story