- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప రాష్ట్రపతి ఎన్నికలు.. సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు నిరాకరించిన శరద్ పవార్
సిపి రాధాకృష్ణన్ తన పార్టీ భావజాలంతో ఏకీభవించరని, ఉప రాష్ట్రపతిగా ఆయనకు మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించిన ఆ కూటమి.. తమ బాగస్వాములందరిని కలిసి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించగా.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (NCP chief Sharad Pawar) మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ ఉపాధ్యక్ష అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ (CP Radhakrishnan)కు మద్దతు ఇవ్వాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) అభ్యరించారు. కానీ మేము ఆయన అభ్యర్థనను తిరస్కరించామని సీఎంకు తెలిపామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)-ఎస్సిపి చీఫ్ శరద్ పవార్ శుక్రవారం తెలిపారు. సిపి రాధాకృష్ణన్ తన పార్టీ భావజాలంతో ఏకీభవించరని, ఉప రాష్ట్రపతి (Vice President Candidate)గా ఆయనకు మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపానని ఈ సందర్భంగా పవార్ చెప్పుకొచ్చారు. జార్ఖండ్ గవర్నర్ పదవిలో ఉండగా, సిపి రాధాకృష్ణన్ 2024 లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎన్సీపీ అధినేత పవార్ (NCP chief Pawar) ఈ సందర్భంగా గుర్తు చేశారు.






