Sharad Pawar: ‘మహాయుతి’ గెలుపుతో ప్రజలు సంతోషంగా లేరు.. శరద్ పవార్

by vinod kumar |
Sharad Pawar: ‘మహాయుతి’ గెలుపుతో ప్రజలు సంతోషంగా లేరు.. శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra)లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) మహాయుతి కూటమి గెలుపుతో ప్రజల్లో ఆనందం కనిపించడం లేదని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad pawar) అన్నారు. ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తిరిగి ప్రజల్లో వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలోని కొల్లాపూర్‌(Kollapur)లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్కీ బహిన్ స్కీమ్ కింద మహిళలకు ఆర్థిక సహాయాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కి పెంచడంతోపాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చాలని, ఇందుకు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కృషి చేస్తుందని చెప్పారు. మహాయుతి కూటమి గెలుపుతో ప్రజల్లో ఎలాంటి ఉత్సాహం లేదని వారంతా నిరాశలో ఉన్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి నియామకం గురించి పవార్ మాట్లాడుతూ.. తమకు అవసరమైన మెజారిటీ లేనందున మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) పార్టీలు ఆ పదవిని పొందాలని పట్టుబట్టడం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో విపక్షాల బలం చాలా తక్కువగా ఉందని, కానీ చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉండటంతో వారు సమస్యలను లేవనెత్తే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed