- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Shambhu Border :రైతులతో చర్చలు.. పంజాబ్, హర్యానాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం
దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13 నుంచి అంబాలా (హర్యానా) సమీపంలోని శంభు సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలు జరపనున్న కమిటీలో సభ్యులుగా చేర్చేందుకు తటస్థ వ్యక్తుల పేర్లను సూచించాలని కోరింది. సంప్రదింపుల ప్రక్రియపై రైతులకు భరోసా కల్పించేందుకే తటస్థ వ్యక్తులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
రైతుల నిరసనకు గల కారణాలపై స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తులు కమిటీలో ఉంటే.. దానిపై రైతుల నమ్మకం పెరుగుతుందని తాము భావిస్తున్నట్లు బెంచ్ పేర్కొంది. ఈమేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మింద్ సింగ్‌లకు సూచన చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది.