- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఏఈలో ఉత్తరప్రదేశ్ మహిళకు మరణశిక్ష
యూఏఈలోని ఇండియన్ ఎంబసీ ఆమెకు న్యాయ సహాయం అందించిది. కానీ, షహ్‌జాదీ తండ్రి మాత్రం కోర్టులో తనుకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని ఆరోపించారు.

- నాలుగు నెలల చిన్నారి మృతి కేసులో దోషి
- హైకోర్టులో బాధితురాలి తండ్రి పిటిషన్
- ఆమెను ఉరి తీశారని వెల్లడించిన ఎంఈఏ
దిశ, నేషనల్ బ్యూరో: తన కూతురు యూఏఈలో ఎలా ఉందో తెలుసుకోవడానికి వేసిన పిటిషన్‌తో ఆమె చనిపోయిందనే విషయం బయటకు వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షహ్‌జాదీ ఖాన్ (33) అనే మహిళను ఫిబ్రవరి 15న యూఏఈ ప్రభుత్వం ఉరి తీసింది. ఈ మేరకు భారత ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు సోమవారం తెలియజేసింది. తన సంరక్షణలో ఉన్న నాలుగు నెలల చిన్నారి మృతికి కారణమైందన్న కేసులో షహ్‌జాదీ ఖాన్‌పై ఆరోపణలు మోపారు. 2022లో అబుదాబిలో ఆమె ఒకరి దగ్గర సంరక్షురాలిగా పని చేసింది. ఆమె సంరక్షణలో ఉన్న నాలుగు నెలల చిన్నారి సాధారణ టీకాలు తీసుకున్న తర్వాత మృతి చెందాడు.చిన్నారి మృతికి షహ్‌జాదీనే కారణమని చెబుతూ మరణ శిక్ష విధించారు. అయితే ఫిబ్రవరి 15న షహ్‌జాదీ తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడింది. తాను ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నానని.. తనను మరో చోటికి మారుస్తారని చెప్పింది. అయితే తనకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని ఆమె తండ్రికి తెలిపింది. తన తల్లిదండ్రులతో మాట్లాడటం తన చివరి కోరిక అని చెప్పగా.. ఇప్పుడు మాట్లాడిస్తున్నారని కూడా తండ్రికి చెప్పింది. ఆ తర్వాత ఆమె గురించి ఏ సమాచారం కూడా తెలియలేదు. దీంతో తన కుమార్తె ప్రస్తుతం పరిస్థితి ఏంటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టును శనివారం ఆశ్రయించారు.
షహ్‌జాదీ ఖాన్‌ను ఫిబ్రవరి 15నే ఉరి తీసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. షహ్‌జాదీని ఉరి తీసినట్లు ఎంఈఏకు ఫిబ్రవరి 28నే యూఏఈ నుంచి సమాచారం అందినట్లు కోర్టుకు తెలిపింది. కాగా, మార్చి 5న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అడిషనల్ సొలిసిటర్ జనర్ చేతన్ శర్మ హైకోర్టుకు వెల్లడించారు. ఇది చాలా దురదృష్టకరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా అన్నారు.
2021 డిసెంబర్‌లో లీగల్ వీసా మీద షహ్‌జాదీ అబుదాబి చేరుకంది. ఆగస్టు 2022లో ఆమెకు ఉద్యోగం ఇచ్చిన యజమానురాలు మగ బిడ్డకు జన్మనిచ్చింది.అయితే రెగ్యులర్ వ్యాక్సినేషన్ తర్వాత 2022 డిసెంబర్ 7న ఆ మగబిడ్డ మృత్యువాతపడ్డాడు. అయితే ఆసుపత్రి ఆ బిడ్డకు పోస్టుమార్టం రికమెండ్ చేసినా తల్లిదండ్రులు మాత్రం దానికి నిరాకచించి, ఎలాంటి విచారణ లేకుండా చేయడానికి సమ్మతిని తెలియజేశారని షహ్‌జాది తండ్రి ఆరోపించారు. 2023 ఫిబ్రవరిలో విడుదల చేసిన ఒక వీడియోలో చిన్నారి మృతికి తానే కారణమని మృతురాలు ఒప్పుకున్నట్లు కనపడింది. అయితే తన యజమానులే తనను హింసించి, ఆ నేరాన్ని ఒప్పించారని కూడా పేర్కొంది. ఆ తర్వాత ఆమెను అబుదాబి పోలీసులకు అప్పగిచగా.. 2023 జూలై 31న ఆమెకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. యూఏఈలోని ఇండియన్ ఎంబసీ ఆమెకు న్యాయ సహాయం అందించిది. కానీ, షహ్‌జాదీ తండ్రి మాత్రం కోర్టులో తనుకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని ఆరోపించారు.






