ఇలాంటివి చేయడం మానుకోవాలి.. షమీ, అక్తర్ ట్వీట్లపై ఆఫ్రిది రియాక్షన్

by Disha Web Desk 21 |
ఇలాంటివి చేయడం మానుకోవాలి.. షమీ, అక్తర్ ట్వీట్లపై ఆఫ్రిది రియాక్షన్
X

ఇస్లామాబాద్: భారత్ బౌలర్ మహ్మద్ షమీ, పాకిస్తాన్ మాజీ స్పీడ్‌స్టర్‌ షోయబ్ అక్తర్‌కు కౌంటరివ్వడంపై మరో మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది స్పందించారు. ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో ఫైనల్లో ఓటమి తర్వాత అక్తర్ హృదయం ముక్కలైందని అర్థమొచ్చేలా ట్వీట్ చేశాడు. దీనిని ట్యాగ్ చేస్తూ షమీ 'సారీ బ్రదర్ దీనినే కర్మ అంటారు' అని చేశాడు.

ఇది కాస్తా వైరల్‌గా మారడంతో పాక్ మాజీ ఆటగాళ్లు, అభిమానుల్లో అసహనాన్ని కలిగించింది. దీనిపై ఆఫ్రిది మాట్లాడుతూ.. 'ఆటగాళ్లుగా మనం రాయబారులుగా వ్యవహరిస్తాం. రెండు దేశాల మధ్య ఘర్షణను ముగించేందుకు మనం ప్రయత్నించాలి. ఇలాంటి చర్యలు ప్రజల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తాయి. మనమే ఇలా చేస్తే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? బంధాలను నిర్మించడంలో క్రీడలు పాత్రను పోషించాలి' అని టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రిటైర్డ్ ప్లేయర్లు అయినప్పటికీ ఇలాంటి చర్యలు ప్రోత్సహించొద్దని తెలిపాడు.


Next Story

Most Viewed