శద్ధా వాకర్ హత్య: అసదుద్దీన్ స్పందనేంటంటే?

by Sathputhe Rajesh |   (  Updated:2022-11-25 04:40:18  IST  )

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యను ఉద్దేశించి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

శద్ధా వాకర్ హత్య: అసదుద్దీన్ స్పందనేంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యను ఉద్దేశించి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన లవ్ జీహాద్ కాదన్నారు. బీజేపీ ఈ హత్యను మత కోణంలో చూస్తోందన్నారు. బీజేపీ రాజకీయాలు సరికాదన్నారు. ఒక మహిళను వేధించడం, హేయంగా ప్రవర్తించడం, దాడికి పాల్పడే కోణంలో చూడాలన్నారు. ఇక ఆజామ్‌ఘడ్‌లో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా చంపి సూట్‌కేస్‌లో కుక్కిన ఘటనపైనా స్పందించిన ఓవైసీ ఇలాంటి ఘటనలు బాధాకరమని, వీటికి హిందూ ముస్లిం రంగులు పులిమి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈశాన్య ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. మెహ్రౌలీ(శ్రద్ధా కేసు) హత్య కలిచివేసిందన్నారు. లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలన్నారు. ఈ దేశానికి అఫ్తాబ్ లాంటి వాళ్ల అవసరం లేదన్నారు. శ్రీరాముడి లాంటి మోడీ అవసరం ఉందన్నారు.

Next Story