- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వివాదస్పద వీడియో విడుదల చేసిన అమెరికా
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (US President Donalrd Trump) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (US President Donalrd Trump) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను ఆ దేశం నుంచి వెనక్కి పంపుతున్నారు. అయితే, అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి.
పైగా అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా అమెరికా ఇందుకు సంబంధించిన ఓ వివాదాస్పద వీడియోను కూడా విడుదల చేసింది. తమ దేశంలోకి అక్రమ మార్గంలో ప్రవేశిస్తే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందంటూ.. అక్రమ వలసదారులను విమానం ఎక్కించేముందు వారికి సంకెళ్లు వేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు. అమెరికా ప్రభుత్వ సలహాదారు, డోజ్ అడ్వైజర్ ఎలాన్ మస్క్ ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ 'హహ వావ్' అంటూ క్యాప్షన్ పెట్టడం వివాదాస్పదంగా మారింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.
కాగా, ఇటీవల అమెరికా మూడు విమానాలలో అక్కడ అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి స్వదేశానికి పంపింది. ప్రయాణంలో తమ చేతులకు, కాళ్లకు బేడీలు వేశారంటూ వారు వాపోయారు. అయితే, మహిళలు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని అమెరికా అధికారులు చెప్పారు. ఇక మరోవైపు అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్ మండిపడుతోంది.






