వాళ్ల సంబంధానికి కారణం కామం కాదు.. ప్రేమే.. హైకోర్టు కీలక తీర్పు

by Dishanational4 |
వాళ్ల సంబంధానికి కారణం కామం కాదు.. ప్రేమే.. హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : మైనర్ బాలికపై అత్యాచారం వ్యవహారంలో కేసును ఎదుర్కొంటున్న వ్యక్తికి బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ వ్యక్తితో కలిసి పారిపోయిన బాలిక పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మైనర్ బాలిక, యువకుడి మధ్య సాగిన లైంగిక సంబంధం అనేది ప్రేమ వ్యవహారమే తప్ప.. కామం కానే కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న 26 ఏళ్ల యువకుడితో తనకు ప్రేమబంధమే ఉండేదని పోలీసులకు మైనర్ బాలిక సాక్ష్యం చెప్పింది. బాలికను బలవంతంగా తీసుకెళ్లినట్లుగా ఎలాంటి ఫిర్యాదులూ లేవన్న విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. యువకుడికి బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.



Next Story

Most Viewed