- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీసీఎస్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడి కలకలం: సుప్రీంకోర్టుకు చేరిన కేసు
మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ (TCS) బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ కేంద్రంలో చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ (TCS) బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (BPO) కేంద్రంలో చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిటిషన్) దాఖలు చేశారు. విదేశీ నిధుల సాయంతో, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ఇలాంటి బలవంతపు మత మార్పిడులను దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పుగా పరిగణించాలని, వీటిని ‘ఉగ్రవాద చర్యల’ (Terrorist act) పరిధిలోకి తీసుకురావాలని ఆయన వాదించారు. చట్టవిరుద్ధమైన మత మార్పిడులను అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని, వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
అసలేం జరిగింది? (బాధితుల ఆరోపణలు)
నాసిక్ టీసీఎస్ కేంద్రంలో 2022 నుంచి మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు, మానసిక వేధింపులు, మతపరమైన ఒత్తిళ్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు 9 మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను కించపరచడం, ఇష్టం లేకపోయినా మాంసాహారం తినాలని బలవంతం చేయడం, మతం మారాలని ఒత్తిడి చేయడం, అసభ్యకరంగా తాకడం, వెంబడించడం వంటివి ఈ ఫిర్యాదుల్లో ఉన్నాయి. ఈ దారుణాలపై హెచ్‌ఆర్ (HR), ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.
సిట్ (SIT) విచారణ.. 8 మంది అరెస్ట్
ఈ వ్యవహారంపై నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఏడుగురు పురుష ఉద్యోగులు ఒక ముఠాగా (Organised group) ఏర్పడి మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇప్పటివరకు మొత్తం 9 ఎఫ్‌ఐఆర్‌లు (FIR) నమోదు చేశారు. ఎనిమిది మందిని (ఏడుగురు పురుషులు, ఒక మహిళ) అరెస్టు చేయగా, ప్రధాన నిందితుల్లో ఒకరైన హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ పరారీలో ఉన్నారు. వివాదం తీవ్రస్థాయికి చేరడంతో నాసిక్ టీసీఎస్ కేంద్రంలో కార్యకలాపాలను యాజమాన్యం తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉద్యోగులందరినీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) చేయాలని ఆదేశించింది.






