పాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు

by Ajay Maddhiboyina |

బజీందర్ సింగ్ ఇంటర్నెట్‌లో పాపులర్ పర్సనాలిటీ. ఆయన నిర్వహించే క్రైస్తవ మతపరమైన కార్యక్రమాలకు పంజాబ్‌లో ఎంతో మంది వెళ్తుంటారు. సోషల్ మీడియాలో కూడా బజీందర్ సింగ్ పాపులర్ అయ్యారు.

పాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
X

- స్వయం ప్రకటిత ప్రవక్తగా బజీందర్ సింగ్ ఫేమస్

- లైంగికంగా వేధించడమే కాకుండా బెదిరింపులు

- తనను వెంబడిస్తున్నాడంటూ బాధితురాలి ఫిర్యాదు

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌కు చెందిన ప్రముఖ పాస్టర్, స్వయం ప్రకటిన క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. పాస్టర్ బజీందర్ సింగ్ తనను లైంగికంగా వేధించడమే కాకుండా తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాడని, బెదిరిస్తున్నాడంటూ పంజాబ్‌లోని కపుర్తల పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. 22 ఏళ్ల మహిళ తమకు ఈ మేరకు కంప్లైంట్ చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. కాగా, ఈ ఆరోపణలను పాస్టర్ బజీందర్ సింగ్ ఖండించారు. వేరే పాస్టర్ కావాలనే తనకు వ్యతిరేకంగా ఈ స్కామ్‌ను రచించాడని అన్నారు.

పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో బాధిత మహిళ పలు విషయాలను వెల్లడించారు. తనకు 17 ఏళ్లు ఉన్నప్పటి నుంచి పాస్టర్ తనకు ఇష్టం లేకున్నా ప్రేమ చూపించే వాడని తెలిపింది. ఈ క్రమంలో తనను అసభ్యంగా తాకేవాడని, తనకు పెళ్లి అయ్యిందని తెలిసినా పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం గురించి తన కుటుంబ సభ్యులకు చెబితే వారికి హానీ చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. 2017లో తన తల్లిదండ్రులు బజీందర్ సింగ్ నిర్వహించే 'చర్చ్ ఆఫ్ గ్లోరీ అండ్ విస్డమ్'కు తీసుకొని వెళ్లారు. అప్పటి నుంచి బాధితురాలు అదే చర్చికి వెళ్తుంది. అయితే పాస్టర్ తన ఫోన్ నంబర్ తీసుకొని అసభ్యకరంగా మెసేజెస్ చేసేవాడని తెలిపింది. ఈ విషయం తన తల్లిదంద్రులకు చెప్పడానికి భయపడ్డానని పేర్కొంది. 2022లో ప్రతీ ఆదివారం చర్చ్‌లోని తన కేబిన్‌లో తనను ఒంటరిగా కూర్చోబెట్టేవాడు. ఆ సమయంలో తనను అసభ్యకరంగా తాకేవాడని బాధితురాలు ఆరోపించింది.

తాను కాలేజీకి వెళ్తుంటే వెంబడించేవాడని చెప్పింది. కొన్నేళ్లుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని, తాను భయాందోళనలను ఎదుర్కుంటున్నాననిచెప్పింది. తనకు పెళ్లి అయినప్పుడు, గర్బంతో ఉన్నప్పుడు కూడా ఈ వేధింపులు ఆగలేదని చెప్పింది. మరో ఎనిమిది మందిపై కూడా ఇలాగే వేధింపులు కొనసాగిస్తున్నట్లు బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కపుర్తల పోలీసులు ఫిబ్రవరి 23న సెక్షన్ 354-ఏ, 354-డి, 506 కింది కేసు నమోదు చేశారు.

ఇది కుట్ర : బజీందర్ సింగ్

తనపై యువతి చేసిన ఆరోపణలు అన్నీ అబద్దమని, ఒక పాస్టర్ కావాలనే ఈ స్కామ్‌ను రచించాడని బజీందర్ సింగ్ చెప్పారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ స్కామ్‌కు పురికొల్పిన పాస్టర్ తనపై గత ఐదేళ్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. అతను ఒక ఛానల్ ఏర్పాటు చేసుకొని అందులో తనపై అబద్దపు వ్యాఖ్యలు చేస్తున్నాడని పేర్కొన్నారు. గతంలో తాను పారిపోయిన ఆ పాస్టర్ కొడుకుపై కేసు పెట్టాను. దాన్ని మనసులో పెట్టుకొని ఈ యువతితో తనపై కేసు పెట్టించాని అన్నారు. తాను ఫిబ్రవరి 16న కేసు పెడితే.. ఫిబ్రవరి 20న పాస్టర్ తనకు వ్యతిరేకంగా కేసు పెట్టించాని చెప్పారు. కాగా, బజీందర్ సింగ్ ఇంటర్నెట్‌లో పాపులర్ పర్సనాలిటీ. ఆయన నిర్వహించే క్రైస్తవ మతపరమైన కార్యక్రమాలకు పంజాబ్‌లో ఎంతో మంది వెళ్తుంటారు. సోషల్ మీడియాలో కూడా బజీందర్ సింగ్ పాపులర్ అయ్యారు.

Next Story