- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైంగిక వేధింపుల ఆరోపణలు.. చైతన్యానంద సరస్వతి అరెస్ట్
by Malleboina Mahesh |
శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ మేనేజర్ స్వామి చైతన్యానంద సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: లైంగిక వేధింపుల (Sexual harassment) ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ మేనేజర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారధిని ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా.. స్వామి చైతన్యానంద కర్ణాటకలోని శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఎస్ఆర్ఐఎస్ఐఐఎంకు మేనేజర్‌గా పని చేస్తున్నారు. అక్కడ స్వామి చైతన్యానంద తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించిన విద్యార్థినులు ఆరోపిస్తూ.. పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చైతన్యానంద ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కోర్టులో హజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






