హెచ్‌ఐవీ బాధిత మైనర్‌పై లైంగిక దాడులు.. అబార్షన్‌తో విషయం వెలుగులోకి..!

by Yella Dhawani Reddy |

హెచ్ఐవీ సోకిన మైనర్‌పై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హెచ్‌ఐవీ బాధిత మైనర్‌పై లైంగిక దాడులు.. అబార్షన్‌తో విషయం వెలుగులోకి..!
X

దిశ, వెబ్ డెస్క్: హెచ్ఐవీ సోకిన మైనర్‌పై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని లాథుర్ (Latur) జిల్లాలో చోటుచేసుకున్న ఘోర అమానవీయ ఘటన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ధారశివ్ జిల్లాకు చెందిన ఓ బాలికకు హెచ్ఐవీ సోకటంతో గత రెండేళ్లుగా లాథుర్‌లోని ఓ బాలికల ఆశ్రయంలో ఉంటోంది. ఈ క్రమంలో ఆశ్రమంలో పనిచేసే ఓ ఉద్యోగి ఆమెపై పలు మార్లు లైంగిక దాడులు జరిపాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈ విషయంలో చిల్డ్రన్‌ షెల్టర్‌ హోమ్‌ నిర్వాహకులు సైతం ఆమెకు సహాయం చేయలేదు. ఉన్నతాధికారులకు బాధితురాలు రాసిన ఉత్తరాలను సైతం వారు చింపేశారు. అయితే, ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల్లో ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలింది.

దీంతో అత్యాచారం చేసిన నిందితుడు డాక్టర్‌తో కుమ్మక్కై బాలికకు తెలియకుండానే అబార్షన్ చేయించాడు. అనంతరం ఈ విషయం తెలుసుకుని బాధిత బాలిక ధోకీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి ఆశ్రమం ఉన్న ఆసా పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం నలుగురిని పోలీసులు అరెస్టు అయ్యారు. అరెస్టు అయినవారిలో ఆశ్రమ వ్యవస్థాపకుడు రవి బాపట్లే, సూపరింటెండెంట్‌ రచన బాపట్లే, ఉద్యోగులు అమిత్‌ మహముని, పూజ వాఘ్‌మరి ఉన్నారు.

Next Story