సెక్స్ వర్కర్ హత్య.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

యూపీ గాజియాబాద్‌లో సెక్స్ వర్కర్ హత్య సంచలనం రేపుతోంది. పూజా అలియాస్ పరీ భాబీ తన నమ్మకస్తుడైన క్లయింట్ చేతిలోనే ప్రాణాలు వదిలింది. నాజర్ అలియాస్ నజీమ్ అనే వ్యక్తి తరుచూ పూజాను ఇంటిమేట్ కోసం పిలుస్తుంటాడు.

సెక్స్ వర్కర్ హత్య.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్: యూపీ గాజియాబాద్‌లో సెక్స్ వర్కర్ హత్య సంచలనం రేపుతోంది. పూజా అలియాస్ పరీ భాబీ తన నమ్మకస్తుడైన క్లయింట్ చేతిలోనే ప్రాణాలు వదిలింది. నాజర్ అలియాస్ నజీమ్ అనే వ్యక్తి తరుచూ పూజాను ఇంటిమేట్ కోసం పిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే తన రూమ్‌కు రమ్మన్నాడు. కానీ ఆమె వచ్చేటప్పుడు భారీ మొత్తంలో బంగారం ధరించడంతో అతని ఇంటెన్షన్ చేంజ్ అయింది. ఆమెను చంపి నగలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్లుగానే ఇద్దరు కలిసి మందు కొట్టారు. ఆమె పడిపోయేంత వరకు తాగించిన నాజర్.. ఆ తర్వాత ఆమెను ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు. నగలన్నీ దోచుకుని.. బాడీని ఓ దుప్పటిలో చుట్టి కాలువలో పడేశాడు. కాగా నజీమ్ స్కూటర్ ద్వారా గుర్తించబడగా.. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.ఇక పరీ భాబీ తను పిలిస్తేనే ఢిల్లీ నుంచి వచ్చిందని.. సెక్స్ కోసమే పిలిచాను కానీ ఖరీదైన ఆభరణాలు చూడటంతో ఇంటెన్షన్స్ మారపోయాయని వెల్లడించాడు.

Next Story