- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెస్ట్ హౌజ్‌లో వ్యభిచారం.. పెద్ద మొత్తంలో కండోమ్స్ స్వాధీనం.. 12 మంది అరెస్ట్
*ఉత్తరప్రదేశ్‌లో వ్యభిచార గృహాలపై కొనసాగుతున్న దాడులు *గెస్ట్ హౌజ్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్న అన్నాదమ్ముల అరెస్ట్ * పెద్ద మొత్తంలో కండోమ్స్, ఎనర్జీ ట్యాబ్లెట్స్ స్వాధీనం

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ వారణాసిలో సెక్స్ రాకెట్లపై దాడులు కొనసాగుతున్నాయి. బబత్‌పూర్‌లో వ్యభిచార గృహాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు పోలీసులు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరవణన్ నేతృత్వంలో జరుగుతున్న స్పెషల్ ఆపరేషన్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫూల్ పూర్ పీఎస్ పరిధిలో ఉన్న సగునహా ప్రాంతంలోని అంశిక రెస్టారెంట్ గెస్ట్ హౌజ్‌పై ఎటాక్ చేసిన పోలీసులు.. వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తున్న అన్నాదమ్ములు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారితోపాటు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో కండోమ్స్, ఎనర్జీ ట్యాబ్లెట్స్, ఆయిల్స్ స్వాధీనం చేసుకున్నారు. SOG-2 పేరుతో జరుగుతున్న ఆపరేషన్ అవినీతి కార్యకలాపాలకు చెక్ పెడుతుంది. స్పా సెంటర్లు, హుక్కా బార్లు నిర్వహించే వారికి చుక్కలు చూపిస్తుంది.






