ఢిల్లీలో 'తీవ్ర' వాయు కాలుష్యం..ఎయిర్ ఎమర్జెన్సీ చర్యలు ప్రారంభం

by Malleboina Mahesh |

దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల వాయు నాణ్యత (Air Quality) మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం..ఎయిర్ ఎమర్జెన్సీ చర్యలు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల వాయు నాణ్యత (Air Quality) మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం సాయంత్రం నాటికి, నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (AQI) 400 మార్కును దాటి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) ప్రమాణాల ప్రకారం 'తీవ్రమైన' (Severe) కేటగిరీలోకి చేరింది. ఈ స్థాయి వాయు కాలుష్యాన్ని సాధారణంగా 'ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి' (Public Health Emergency)గా పరిగణిస్తారు. దీనిపై స్పందించిన వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) తక్షణమే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లోని స్టేజ్ III ఆంక్షలను నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) అంతటా అమలు చేయాలని నిర్ణయించింది. బలహీనమైన గాలులు, అనుకూలించని వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య కారకాలు చెదరక, రాత్రిపూట పేరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

నిర్మాణ పనులు, వాహనాలపై ఆంక్షలు

వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అత్యవసర ప్రతిస్పందన చర్యలు (Emergency Response Measures) ప్రారంభమయ్యాయి. ఇప్పటికే GRAP స్టేజ్ కింద, అత్యవసరం కాని అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులను (సిమెంట్, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి రవాణా తో సహా) నిషేధించారు. అలాగే గ్రాఫ్-4 చర్యల్లో భాగంగా.. పాత BS-III పెట్రోల్, BS-IV డీజిల్ నాలుగు చక్రాల వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు. అనేక పర్యవేక్షణ కేంద్రాలలో AQI 445 (వజీర్‌పూర్) వంటి అత్యధిక విలువలను నమోదు చేసింది. ఈ విషపూరితమైన పొగమంచు దట్టంగా కమ్ముకోవడం వల్ల దృశ్యమానత (Visibility) తగ్గి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్న వారి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు గా మారింది.

Next Story