- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లడఖ్‌లో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి, పలువురికి సీరియస్!
జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ జోజిలా పాస్ (Zoji La Pass) వద్ద సంభవించిన భారీ హిమపాతం ఏడుగురి ప్రాణాలను బలిగొంది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ జోజిలా పాస్ (Zoji La Pass) వద్ద సంభవించిన భారీ హిమపాతం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జోజిలా పాస్ వద్ద ఉన్న అత్యంత ఎత్తైన మంచు కొండల నుంచి భారీగా మంచు చరియలు విరిగి కింద ఉన్న రహదారిపై పడ్డాయి. ఆ సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు మంచు కింద చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్మీ మరియు విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అప్పటికే ఏడుగురు మృతిచెందినట్లు గుర్తించారు. ప్రస్తుతం మంచు కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
నిలిచిపోయిన రవాణా.. మూతపడ్డ హైవే..
ఈ ప్రమాదం కారణంగా శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. భారీగా పేరుకుపోయిన మంచును తొలగించే పనులు యుద్ధప్రతిపాదికన జరుగుతున్నాయి. పర్యాటకులు మరియు స్థానిక ప్రయాణికులు ఎవరూ కూడా ఈ మార్గంలో రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉండటంతో సహాయక చర్యలకు కొంత అంతరాయం ఏర్పడుతోంది. హిమపాతం సమయంలో సుమారు పదుల సంఖ్యలో వాహనాలు ఆ మంచు గోడల మధ్య చిక్కుకుపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.






