- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపు చంద్ర దాస్ హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్: బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు!
బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లా భలూకాలో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ (27) పై జరిగిన మూకదాడి, హత్య ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లా భలూకాలో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ (27) పై జరిగిన మూకదాడి, హత్య ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. దైవదూషణ ఆరోపణలతో అల్లరి మూకలు అతడిని కొట్టి చంపి, మృతదేహాన్ని చెట్టుకు కట్టి తగలబెట్టిన ఈ క్రూరమైన చర్యను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేపట్టిన రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB-14) వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఏడుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. నిందితులను ఎండీ లిమన్ సర్కార్, ఎండీ తారెక్ హొస్సేన్, ఎండీ మానిక్ మియా, ఎర్షాద్ అలీ, నిజుమ్ ఉద్దీన్, అలోంగిర్ హొస్సేన్, ఎండీ మిరాజ్ హొస్సేన్ అకాన్‌గా గుర్తించారు.
ఈ ఘటనపై మహమ్మద్ యూనస్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "కొత్త బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసకు తావు లేదు" అని స్పష్టం చేశారు. బాధితుడు దీపు చంద్ర దాస్ స్థానిక వస్త్ర కర్మాగారంలో పనిచేసే సామాన్య కార్మికుడని, అకారణంగా అతడిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన ఏ ఒక్కరినీ విడిచిపెట్ట బోమని, దోషులందరికీ కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాద మూకల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.






