Mehul Choksi: దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి షాక్

by Shamantha N |

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్టు చేయగా.. దాన్ని సవాల్ చేస్తూ కోర్టుని ఆశ్రయించారు.

Mehul Choksi: దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్టు చేయగా.. దాన్ని సవాల్ చేస్తూ కోర్టుని ఆశ్రయించారు. కాగా.. కోర్టులో చోక్సీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పిటిషన్ పై మంగళవారం విచారణ జరగ్గా.. కేసుని వాయిదా వేసింది. అయితే, తదుపరి విచారణ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. అయితే, ఈ పిటిషన్‌లో అతడు బెల్జియం అధికారులపై పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తన అరెస్టుకు సంబంధించి అధికారులు సరైన చట్ట విధానాలను అనుసరించలేదని, తన ప్రిథమిక హక్కులకు సైతం భంగం కలిగించారని ఆరోపించినట్లు తెలుస్తోంది. కాగా.. గతవారం బెయిల్‌ కోసం చోక్సీ పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే, కోర్టు దాన్ని తిరస్కరించింది. ఈ విషయాన్ని చోక్సీ న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారని, క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారని అగర్వాల్‌ తెలిపారు.

మోసం కేసులో..

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో మెహుల్ చోక్సీపై ఆరోపణలు వచ్చాయి. ఆయన మేనల్లుడు నీరవ్ మోడీ కూడా దేశం విడిచి పారిపోయాడు. చోక్సీ ఆంటిగ్వాకు వెళ్లగా.. నీరవ్‌మోడీ లండన్‌ కి పారిపోయాడు. అయితే, చోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గత నెల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి చోక్సీ సాయంతో 2023 నవంబరులో అతడు ‘ఎఫ్‌ రెసిడెన్సీ కార్డ్‌’ పొందాడు. అందుకు అతడు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. అతడికి భారత్‌లో, అంటిగ్వాలో పౌరసత్వాలు ఉన్న విషయాన్ని దాచి పెట్టాడు. ఈ కారణాలతోనే అక్కడి అధికారులు అతడ్ని అరెస్టు చేశారు. మరోవైపు.. అతడిని భారత్‌ (India)కు రప్పించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story