- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్
అస్సాం ముఖ్యమంత్రి భార్యపై వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు గౌహతి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: అస్సాం సీఎం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు కోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరగా.. ఇవాళ గౌహతి హైకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు సంబంధించి పవన్ ఖేరా గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఖేరా, తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన గౌహతి హైకోర్టు, పవన్ ఖేరా అభ్యర్థనను ఆమోదించడానికి నిరాకరించింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటూ ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు నోటీసులు అందుకున్న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది తేలాల్సి ఉంది.






