సుప్రీంకోర్టులో అనిల్‌ అంబానీకి ఎదురుదెబ్బ.. రుణాల రికవరీకి లైన్ క్లియర్

by Kema Shiva Kumar |

అనిల్ అంబానీ రుణాల రికవరీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

సుప్రీంకోర్టులో అనిల్‌ అంబానీకి ఎదురుదెబ్బ.. రుణాల రికవరీకి లైన్ క్లియర్
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి అత్యున్నత న్యాయస్థానంలో తీవ్ర చుక్కెదురైంది. ఆయన తీసుకున్న రుణాల రికవరీ విషయంలో బ్యాంకులు తదుపరి చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. గతంలో అనిల్ అంబానీ వ్యక్తిగత రుణాల రికవరీ కోసం బ్యాంకులు చట్టపరమైన చర్యలు చేపట్టవచ్చని బాంబే హైకోర్టు (Bombay High Court) తీర్పును వెలువరిచింది. ఈ తీర్పు తన వ్యాపార ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని భావించిన అనిల్ అంబానీ, బాంబే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ముంబై హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడమే కాకుండా, అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

బ్యాంకుల చర్యలకు మార్గం సుగమం..

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అనిల్ అంబానీకి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఆయనపై రికవరీ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉంది. వ్యక్తిగత పూచీకత్తు (Personal Guarantee) ఆధారంగా బ్యాంకులు ఆయన ఆస్తులపై లేదా దివాలా ప్రక్రియ ద్వారా బకాయిలను వసూలు చేసుకునేందుకు చట్టపరంగా పూర్తి స్వేచ్ఛ లభించింది. వరుస నష్టాలు, రుణ భారంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న అనిల్ అంబానీకి సుప్రీం తీర్పు మరింత ఇబ్బందికరంగా మారనుంది.

Next Story