Prajwal Revanna: అత్యాచారం కేసులో సంచలన తీర్పు.. కోర్టులోనే ఏడ్చేసిన మాజీ ఎంపీ

by Prasad Jukanti |   (  Updated:2025-08-01 09:37:56  IST  )

అత్యాచారం, పోర్న్ వీడియోల కేసులో మాజీ ఎంపీకి కోర్టు షాకిచ్చింది.

Prajwal Revanna:  అత్యాచారం కేసులో సంచలన తీర్పు.. కోర్టులోనే ఏడ్చేసిన మాజీ ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అత్యాచారం కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణకు (Prajwal Revanna) కోర్టు షాకిచ్చింది. కర్ణాటకలోని (Karnataka) ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ మేరకు న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. దీనిపై రేపు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కోర్టు వెలువరించిన తీర్పు వినగానే కోర్టు హాల్ లోనే ప్రజ్వల్ కంటతడి పెడ్డుకున్నారు. తనపై ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ దారుణాన్ని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ కర్ణాటక సైబర్ పోలీసులను 2024లో ఆశ్రయించింది. 2021లో ఆయన ఫామ్ హౌస్ లో ప్రజ్వల్ తనపై రెండుసార్లు అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. తన తల్లి ఫోన్ కు కాల్ చేసి వీడియో కాల్ లో మాట్లాడాలని నన్ను బలవతం చేసేవాడని నా దుస్తులు విప్పాలని అడిగేవాడు. అందుకు నిరాకరిస్తే మా అమ్మకు హాని తలపెడతానని బదిరించే వాడని ఆమె దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ వియంలో పోలీసులకు ఫిర్యాదు ఇస్తే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంది. ప్రజ్వల్ బాధితుల్లో మరెంతో మంది మహిళలు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది.

పెన్ డ్రైవ్ లో 2900 వీడియోలు:

ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన తర్వాత బయటి ప్రపంచానికి ప్రజ్వల్ దారుణాలు వెలుగు చూశాయి. పహసన్ లోని ఫామ్ హౌస్ లో ఓ పెన్ డ్రైవ్ ను పోలీసులు స్వాధీనం చేసుకోగా అందులో 2,900 పోర్న్ వీడియోలు ఉన్నాయి. అవి ప్రజ్వల్ వివిధ మహిళలతో అఘాయిత్యానికి పాల్పడుతూ రహస్యంగా తీసిన వీడియోలుగా సిట్ గుర్తించింది. ఈ వీడియోలు గత లోక్ సభ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ప్రజల్వల్ సెక్స్ స్కాండల్ కర్ణాటకలో రాజకీయ ప్రకంపణలకు కారణం అయింది. ఈ వ్యవహారంలో ప్రజ్వల్ పై మూడు కేసులు కాగా వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుపుతోంది.

Next Story