వాళ్లు రేప్‌ను ఇష్టపడతారు.. సీజేపీ నిరసనలో పాల్గొన్న మహిళలపై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

నీట్ పేపర్ లీకేజీపై సీజేపీ చేసిన ఆందోళనలపై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త టీజీ మో హన్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆందోళనను అదుపుచేసే బాధ్యత తనపై ఉండి ఉంటే నిరసనచేస్తున్నవారిపై కాల్పులు జరపాలని భద్రతా దళాలలను ఆదేశించేవాడినని చెప్పారు.

వాళ్లు రేప్‌ను ఇష్టపడతారు.. సీజేపీ నిరసనలో పాల్గొన్న మహిళలపై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీకేజీపై సీజేపీ చేసిన ఆందోళనలపై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త టీజీ మో హన్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆందోళనను అదుపుచేసే బాధ్యత తనపై ఉండి ఉంటే నిరసనచేస్తున్నవారిపై కాల్పులు జరపాలని భద్రతా దళాలలను ఆదేశించేవాడినని చెప్పారు. నిరసనకారులను చెదరగొట్టడానికి ముందు జంతర్ మంతర్ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో కర్ఫ్యూ విధించేవాడినని అన్నారు. ఒకవేళ అక్కడ నుండి పారిపోకుండా ఉంటే కాల్పులు జరపాలని ఆదేశించేవాడినని చెప్పారు.

కాల్పులు జరిపితే ప్రజలు పరుగులు తీస్తారు అందులో కొందరు చనిపోతారు. కొందరికి తీవ్రగాయాలు అవుతాయి కానీ నాలుగు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నిరసనల్లో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారు సామూహిక అత్యాచారాలను ఇష్టపడే మహిళలు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సామూహిక అత్యాచారాలు జరుగుతాయి కానీ దేవుడి దయ వల్ల ఎలాంటి ఫిర్యాదులు రావని చెప్పాడు.

ఎందుకంటే వారు అత్యాచారాలను ఇష్టపడేవారని, వారు ముఖ్యంగా వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్యవాద విశ్వాసులు అని వ్యాఖ్యానించారు. టీజీ మోహన్ చేసిన వ్యాఖ్యలు కేరళలో దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన కేరళ ఆర్ఎస్ఎస్ నేతలు టీజీ మోహన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవేనని అంటున్నారు.

Next Story