సంచలన ఆపరేషన్.. భారీ ఎత్తున ఉగ్ర సామాగ్రి స్వాధీనం

by Malleboina Mahesh |

జమ్మూ కశ్మీర్ పోలీసులు మరోసారి ఉగ్రవాద నెట్‌వర్క్‌పై పెద్ద దెబ్బ కొట్టారు. దేశ భద్రతను కదిలించే కుట్రను భగ్నం చేస్తూ.. ఫరీదాబాద్‌లో నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థం, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

సంచలన ఆపరేషన్.. భారీ ఎత్తున ఉగ్ర సామాగ్రి స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్ పోలీసులు మరోసారి ఉగ్రవాద నెట్‌వర్క్‌పై పెద్ద దెబ్బ కొట్టారు. దేశ భద్రతను కదిలించే కుట్రను భగ్నం చేస్తూ.. ఫరీదాబాద్‌లో నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థం, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక అసాల్ట్ రైఫిల్‌తో పాటు మూడు మ్యాగజైన్లు, 83 లైవ్ రౌండ్లు, అదనంగా ఒక పిస్టల్‌, ఎనిమిది లైవ్ రౌండ్లు, రెండు ఖాళీ కార్ట్రిడ్జ్‌లు, రెండు అదనపు మ్యాగజైన్లు, ఎనిమిది పెద్ద సూట్‌కేసులు, నాలుగు చిన్న సూట్‌కేసులు, ఒక బకెట్‌లో సుమారు 360 కిలోల జ్వలన పదార్థం (అమ్మోనియం నైట్రేట్ అనుమానం)లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అలాగే 20 టైమర్లు, బ్యాటరీలు, 24 రిమోట్లు, 5 కిలోల హేవీ మెటల్, వాకీటాకీ సెట్లు, ఎలక్ట్రిక్ వైర్లు, బ్యాటరీలు, ఇతర కాంట్రాబాండ్ వస్తువులు కూడా పోలీసులు గుర్తించారు. కమిషనర్ సతేందర్ కుమార్ మాట్లాడుతూ, “ఇది RDX కాదు, అలాగే స్వాధీనం చేసిన రైఫిల్‌ కూడా AK-47 కాదు,ది AK-47 లా కనిపించినా కాస్త చిన్న పరిమాణంలో ఉంటుంది,” అని వివరించారు. ఈ ఆపరేషన్ ఉగ్రవాద గ్రూపులు పెద్ద కుట్రకు సిద్ధమయ్యారనే అనుమానాలను మరింత బలపరుస్తోంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఈ స్వాధీనం కీలక ఆధారాలు అందించనున్నాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

Next Story