- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రన్న పార్టీ ద్రోహి.. గణేష్ పేరిట మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు బండి ప్రకాష్, చంద్రన్నలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు బండి ప్రకాష్, చంద్రన్నలు లొంగిపోయిన సంగతి తెలిసిందే. అయితే పుల్లూరి ప్రసాదరావు(Pulluri Prasada Rao) అలియాస్ చంద్రన్న పార్టీ ద్రోహి అంటూ.. ఒడిశాకు చెందిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి గణేష్ పేరిట లేఖను విడుదల చేసింది. భవిష్యత్తులో తన విప్లవాన్ని ప్రజల మధ్య ఉంది చేస్తాను అనడం, తన దిగజారుడుతనాన్ని కప్పుకునే ముసుగు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజ్యం ఎదుట లొంగిపోయిన తాను విప్లవకారుడిని అని చెప్పుకునే హక్కు అతనికి లేదనిమండిపడ్డారు.
అలాగే బసవరాజ్ మరణం తర్వాత దేవ్ జీ జనరల్ సెక్రెటరీగా ఎన్నుకోబడ్డానని చెప్పడం కూడా అబద్దమని, బసవరాజ్ మరణం తర్వాత తాము ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని, ఆపరేషన్ కగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దారుణమైన హత్యలు చేస్తోందని, ఇలాంటి స్థితిలో సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే దేశంలో సుదీర్ఘ విప్లవ ఉద్యమం ఎన్నో కఠిన పరిస్థితులను దాటుకొని వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం దేశం ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, సామాజిక అసమానతలు వంటి సమస్యలను కప్పిపుచ్చుకోడానికి రాజ్యాంగ వ్యవస్థను ప్రజల మీద దోపిడీ చేసే సాధనంగా ఉపయోగిస్తోందని అన్నారు.
అందుకే ప్రజలు మరోసారి మిలిటెంట్ మార్గాన్ని, తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకోవాల్సిన చరిత్రాత్మక సమయం వచ్చిందన్నారు. గత రెండేళ్లుగా పార్టీకి ఎదురైన నష్టాల నుంచి బయటపడటానికి, ఉద్యమాన్ని బలంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తోందని తెలియజేస్తూ.. తమ కామ్రేడ్స్, ప్రజలు, మిత్రులు, విప్లవ మద్దతుదారులు ప్రభుత్వ అణచివేతకు భయపడకుండా ధైర్యంగా నిలబడాలని కోరారు. కఠినమైన ఈ పరిస్థితిని తట్టుకొని పార్టీ నిలబడుతుందని తమకు నమ్మకం ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు.






