Operation Kagar Effect: మావోయిస్టు అగ్రనేత అభయ్ సంచలన లేఖ

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-28 16:15:35  IST  )

ఆపరేషన్ కగార్‌(Operation Kagar)ను వెంటనే ఆపేయాలని.. తమతో శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు(Maoists) ప్రకటించారు.

Operation Kagar Effect: మావోయిస్టు అగ్రనేత అభయ్ సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్‌(Operation Kagar)ను వెంటనే ఆపేయాలని.. తమతో శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు(Maoists) ప్రకటించారు. సోమవారం సాయంత్రం మావోయిస్టు అగ్రనేత అభయ్(Abhay) పేరుతో లేఖ విడుదల చేశారు. షరతులు లేకుండా చర్చలు జరుపాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా భద్రతా బలగాలు వరుస ఎన్‌కౌంటర్లకు దిగుతున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్నా, మొన్నటివరకు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కాల్పులు జరుపగా, తాజాగా భూపాలపల్లి సరిహద్దు వరకూ జల్లెడ పడుతున్నారు. మరోవైపు కర్రిగుట్టల్లోనూ వేట కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్‌ కగార్‌ను స్పీడప్‌ చేశారు. ఈ వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు. దీనిపై పలు రాజకీయ పార్టీల నేతలు సైతం స్పందించి ఎన్‌కౌంటర్‌ను ఖండించారు. శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story