- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులొ సంచలన నిజాలు
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసు(Karnataka Former DGP Murder Case) దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసు(Karnataka Former DGP Murder Case) దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆదివారం ఆయన ఇంట్లో చనిపోయి ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. అయితే ఓం ప్రకాష్ హత్య వెనుక ఆయన భార్య పల్లవి ఉండవచ్చునని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పంపకాల్లో జరిగిన గొడవలో భర్తను చంపి ఉండవచ్చునని అధికారులు పేర్కొన్నారు.
అయితే ఓం ప్రకాష్ హత్య అనంతరం తన స్నేహితురాలికి 'కిల్డ్ ద మోన్స్టర్'(Killed The Monster) అంటూ మెసేజ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు.. ఈ హత్య ఆయన భార్య పల్లవే చేసింది అనడానికి బలాన్ని చేకూరుస్తుందని వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు అవసరమని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు.






