బెంగళూరు డాక్టర్ హత్యకేసు.. ప్రియురాలిని పట్టించిన డిజిటల్ పేమెంట్ యాప్ మెసేజ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-04 07:50:29  IST  )

బెంగళూరులో భర్త చేతిలో హతమైన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో సంచలన విషయం బయటపడింది.

బెంగళూరు డాక్టర్ హత్యకేసు.. ప్రియురాలిని పట్టించిన డిజిటల్ పేమెంట్ యాప్ మెసేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులో భర్త చేతిలో హతమైన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో సంచలన విషయం బయటపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 24న కృతికా రెడ్డి (29) మరణించగా.. తన భార్య అనారోగ్యంతో చనిపోయిందని డాక్టర్ మహేంద్రారెడ్డి అందరినీ నమ్మించబోయాడు. కానీ.. పోస్టుమార్టంలో ఆమె మత్తుమందు ఓవర్ డోస్ కారణంగా చనిపోయినట్లు తేలడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులు, సన్నిహితులను విచారించారు. 6 నెలల తర్వాత భర్తే ఆమెను అంతమొందించినట్లు విచారణలో తేలగా.. అక్టోబర్ 14న మహేంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు.

భార్య అనారోగ్యానికి గురవ్వగా.. తాను కూడా డాక్టరే కావడంతో మహేంద్రే ఇంట్లో ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించిన అతను.. భార్యకు అనుమానం రాకుండా.. మత్తుమందును హై డోస్ లో ఇంజక్ట్ చేశాడు. ఏప్రిల్ 21 నుంచి 24 వరకూ ఇచ్చిన మత్తుమందు కారణంగా ఆమె చనిపోయింది. ఆమె మరణాన్ని నిర్థారించుకున్న వెంటనే తన ప్రియురాలికి నీకోసం నా భార్యను చంపేశా అంటూ.. డిజిటల్ పేమెంట్ యాప్ లో మెసేజ్ చేశాడు. అతడి ఫోన్ ను పరిశీలిస్తున్న క్రమంలో తాజాగా ఈ మెసేజ్ బయటపడింది. కానీ ప్రియురాలి వివరాలు వెల్లడించలేదు. ఆమె చెప్తేనే డాక్టర్ తన భార్యను చంపేశాడా? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story